1000 రోజులు ఆడుతున్న “లెజెండ్” ధియేటర్ ను చూస్తారా?

legend-movie-1000-days-fake-record-1బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “లెజెండ్” సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఎంత సూపర్ హిట్ అయ్యిందంటే… ఈ సినిమా ఒకే ధియేటర్లో ఏకంగా 1000 రోజులు ఆడేటంత! ఇటీవలే దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా ‘950 నుండి 1000’ రోజుల పోస్టర్ ను కూడా ఘనంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి నిజంగా ‘లెజెండ్’ సినిమా ఆ రేంజ్ లో ఆడుతోందా?

దానిపైనే సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. దీంతో ఈ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ అవతారం వెలుగులోకి వచ్చింది. ‘లెజెండ్’ 1000 రోజులు ఆడుతున్న ధియేటర్ ఇదేనంటూ, ఓ నాలుగు ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. మరి ఆ ధియేటర్ ఏమో కొత్త హంగులు హద్డుకుంటూ, రిపేర్లు చేసుకుంటూ దర్శనమిస్తోంది. అది కూడా బాల్కనీ, ఫస్ట్ క్లాస్ సీట్లు లేకుండానే!

ADVERTISEMENT

ఈ రెండు క్లాసుల సీట్లు లేకుండానే ‘లెజెండ్’ సినిమాను ప్రదర్శిస్తున్నారా? అసలు ‘లెజెండ్’ సినిమా ఆ ధియేటర్లో ఆడుతోందా? నిజంగా ‘లెజెండ్’ సినిమా ప్రదర్శిస్తోన్న ధియేటర్ అదేనా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఈ ఫోటోలను చూస్తున్న వీక్షకులలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా… ఇలాంటి అనవసరపు రికార్డుల కోసం చిత్ర యూనిట్ పడుతున్న ప్రయాస చూసి ముక్కున వేలేసుకోవడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది.

legend-movie-1000-days-fake-record

legend-movie-1000-days-fake-records

legend-movie-1000-days-fake-record-2

ADVERTISEMENT
Latest Stories