శవాలపై పేలాలు ఏరుకోవడం ఇదేగా?

Locals searching for melted gold in ashes after Kurnool bus fire tragedy

ఏదైనా నికృష్టమైన చర్యగా వర్ణించడానికి శవాలపై పేలాలు ఏరుకోవడంగా అభివర్ణిస్తుంటారు. కానీ ఇది చూస్తే అదేమిటో అర్ధమవుతుంది. ఇటీవల కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అప్పుడు పోస్టు మార్టం, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు అప్పగించారు. ఆ తర్వాత ప్రజలు క్రమంగా ఈ విషాద ఘటన గురించి మరిచిపోయారు. పోలీసులు దర్యాప్తు తర్వాత మంటలలో కాలి దగ్ధమైన బస్సుని అలాగే వదిలేశారు.

దీంతో కొంత మంది స్థానికులు అక్కడకు చేరుకొని బస్సులోపల, కింద చుట్టూ పేరుకుపోయిన బూడిదను సంచీలలో ఎత్తుకొని సమీపంలో ఉన్న చెరువు వద్ద ఆ బూడిదని జల్లెడలో కడుగుతున్నారు. దేనికంటే, బస్సులో సజీవ దహనం అయిపోయిన వారి ఒంటిపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలు ఆ వేడికి కరిగి చిన్న చిన్న ముద్దలుగా మారి ఆ బూడిదలో కలిసిపోయి ఉంటాయని!

ADVERTISEMENT

ఇప్పుడు వెండి, బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కనుక ఆ బూడిదలో వెండి, బంగారం దొరకకపోతుందా?అని వెతుకుతున్నారు.

దారిన పోయేవారెవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే నెటిజన్స్ వారిని అసహ్యించుకుంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదేగా? అని విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories