జీవితపై మండిపడిన మరో తెలుగు హీరోయిన్!

Two-Heroines-Crushed-Under-Casting-Couch---Madhavi-Lathaకాస్టింగ్ కౌచ్ అంశంలో తన పేరు వచ్చినందుకు గానూ ఫైర్ అయిన జీవిత రాజశేఖర్, దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే జీవిత లేవనెత్తిన పలు అంశాలపై మరో తెలుగు హీరోయిన్ మాధవీలత మండిపడ్డారు. ఫేస్ బుక్ వేదికగా చేసిన ఈ పోస్టింగ్ లో జీవితపై తనకు గౌరవం పోయిందని అన్నారు.

“ఇన్నాళ్ళు బయటకు రాని జీవిత గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆవిడ మీద ఆరోపణలు వచ్చింది అని వచ్చారా? టాలెంట్ ఉంటే వెతికి పట్టుకుని ఆఫర్స్ ఇస్తారా? హహహహః ఎవడ్ని ఎవరు వెతికి పట్టుకున్నారట? అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకున్నారు, ఇవ్వకపోతే ఎలా వెతుకుతారు… ఇన్నాళ్ళు గౌరవం ఉండేది, ఈ క్షణం పోయింది” అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది మాధవీలత.

ADVERTISEMENT

అలాగే పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గానూ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఫిల్మ్ చాంబర్ ఎదుర మౌన దీక్ష చేయబోతున్నానని ప్రకటించారు. పవన్ పై పదజాలం తనకు చాలా బాధేసిందని శ్రీరెడ్డిని కూడా పరోక్షంగా విమర్శించారు ఈ తెలుగు బ్యూటీ. మొత్తానికి టాలీవుడ్ లో జరుగుతోన్న ‘కాస్టింగ్ కౌచ్’ అంశం ఇప్పట్లో ముగిసేలా అయితే లేదు.

ADVERTISEMENT
Latest Stories