‘సెన్సార్’ కాగానే ‘సూపర్బ్’ అన్నారు!

Mahanubhavudu Trailer Talk All Sings Of A Winnerఈ దసరాకు రెండు పెద్ద సినిమాలతో పాటు బరిలో ఉన్న మారుతీ – శర్వానంద్ ల “మహానుభావుడు” సినిమా కూడా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 29వ తేదీన విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. రెండు పెద్ద సినిమాల మాదిరే ఈ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ మంజూరు అయ్యింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ లభిస్తుందని భావించినప్పటికీ, ‘యు/ఎ’ రావడం విశేషం.

అయితే ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు, షో ముగియగానే ‘సూపర్’ అంటూ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత సినీ అభిమానులు కూడా ఇదే డైలాగ్ వాడగా, తాజాగా సెన్సార్ సభ్యులు కూడా అదే రీతిన స్పందించడం విశేషం. దీంతో సంక్రాంతి మాదిరే దసరా కూడా శర్వానంద్ కు మధురానుభూతిని మిగులుస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు సీరియస్ నోట్ లో ఉండడం, ‘మహానుభావుడు’కు బాగా కలిసొచ్చే అంశం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories