ఇది సర్ ప్రైజ్ – మహేష్ ఫ్యాన్స్ హంగామా షురూ!

ఎట్టకేలకు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ వంటి రెండు దారుణ పరాజయాల తర్వాత ఎంతగానో ఎదురుచూస్తున్న “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ గురించి ఇదంతా! అవును… ఈ పండగకు ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, స్మాల్ వీడియో క్లిప్ గానీ విడుదల చేస్తారన్న సమాచారం ఇటీవల హల్చల్ చేసింది.

ADVERTISEMENT

అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో… ఈ ఫెస్టివల్ నుండి ఫస్ట్ లుక్ అవుట్ అయిపోయిందని మానసికంగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో మహేష్ బాబు అఫిషియల్ టీం నుండి ఓ ట్విట్టర్ సందేశం వచ్చింది. “సూపర్ స్టార్ మహేష్ బాబు 24 ఆన్ ది వే” అంటూ ట్యాగ్ చేస్తూ… చిత్ర ప్రొడక్షన్ యూనిట్ ‘డివివి ఎంటర్టైన్మెంట్స్’ను చూస్తూ ఉండండి… అంటూ ట్వీట్ రావడంతో మహేష్ అభిమానులకు సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చినట్లయ్యింది.

ఇంతకీ ఏది రిలీజ్ అవబోతోంది? ఎప్పుడు రిలీజ్ అవబోతోంది? అన్నది ఫ్యాన్స్ లో క్యూరియాసిటిని మరింతగా పెంచుతోంది. మహేష్ బాబు పోస్టర్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతోందా? టైటిల్ ను రివీల్ చేయబోతున్నారా? లేక మరింత షాక్ ఇచ్చే విధంగా ఏకంగా ఫస్ట్ టీజర్ ను తీసుకువస్తారా? ముందుగా అంచనా వేసింది కాకపోవడంతో… ఏది వచ్చినా ప్రిన్స్ అభిమానులకు పండగేనని చెప్పవచ్చు. ‘శ్రీమంతుడు’ తరహాలోనే కొరటాల మాయాజాలం మాత్రం కావాలంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.


Mahesh-Babu

ADVERTISEMENT
Latest Stories