కొరటాల… ఎంతపని చేసావయ్యా..!

Mahesh Babu Is the CM in UnDivided Andhra Pradesh -Bharat Ane Nenuఅవిచ్చిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రిన్స్ మహేష్ బాబు ప్రమాణ స్వీకార స్వరం వినడానికి అందరూ సిద్ధంగా ఉండమని చెప్పిన చిత్ర దర్శకుడు కొరటాల శివ, మరికొద్దిసేపటికి ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ రిలీజ్ సమయాన్ని మరోసారి ధృవీకరించారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ పోస్టర్ కు ఒక్క మహేష్ బాబు అభిమానులే కాదు, యావత్తు సినీ లోకం ఫిదా అవుతోంది.

ADVERTISEMENT

మరి అంతలా ఉంటే ప్రిన్స్ ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు ఎలా పడుతుంది? అవును… పరోక్షంగా మహేష్ బాబు అభిమానులకు కొరటాల శివ నిద్రాభంగం చేసినట్లే చెప్పవచ్చు. ముందుగా నడుస్తున్న మహేష్ వెంట సెక్యూరిటీతో పాటు సాధారణ జనంతో కూడిన ఈ పోస్టర్ సింపుల్ గా అదిరిపోయిందన్న టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకదా…. ఇలాంటి కిక్ ఇచ్చే పోస్టర్లు కోసమే కదా… ప్రిన్స్ అభిమానులు ఇన్నాళ్ళు వేచిచూసింది..!

ADVERTISEMENT
Latest Stories