మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ఓ పక్కన చిత్ర యూనిట్ మీడియా మీట్ లతో ప్రచారం సాగిస్తుంటే మరో పక్కన మేకింగ్ వీడియోలతో నిర్మాణ సంస్థ జోరు పెంచుతోంది. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోని ‘బాలత్రిపురమణి’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ పాట గురించి ఇటీవలే సమంత ఓ ట్వీట్ చేసి అంచనాలు పెంచగా… దానికి తగిన విధంగా పాట ఉన్నట్లు కనపడుతోంది. పాటకు తగిన విధంగా ప్రిన్స్ స్టెప్స్, లుక్స్ ఆకట్టుకోగా, తోట తరణి అందమైన సెట్ లొకేషన్ కన్నుల పండుగగా కనపడుతోంది. ఇక, కృష్ణచైతన్య లిరిక్స్, రాహుల్ నంభియార్ స్వరం… కలగలిపి ఇప్పటికే ఈ ఆల్బమ్ లో సూపర్ హిట్ సాంగ్ గా మోత మోగిస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



