‘బ్రహ్మోత్సవం’ మోషన్ పిక్చర్ – బైక్ అదిరింది!

Brahmotsavam Motion Posterఎప్పుడెప్పుడా అని ప్రిన్స్ అభిమానులు ఎదురుచూస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను ప్రిన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసారు. వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో కూడిన ఈ మోషన్ పిక్చర్ లో ప్రిన్స్ డ్రైవ్ చేసిన ‘బైక్’ హైలైట్ గా నిలిచింది.

ADVERTISEMENT

గాగుల్స్ పెట్టుకుని, సింపుల్ కాస్ట్యూమ్స్ తో ప్రిన్స్ ఎప్పటిలాగే ఆకట్టుకుంటుండగా, ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు చక్రాల బుల్లెట్ అందరినీ పడేస్తోంది. ఇప్పటివరకు హల్చల్ చేసిన ఫోటోలలో ఈ బైక్ కనపడకపోవడంతో, ప్రిన్స్ అభిమానులకు చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చినట్లయ్యింది. ఈ మోషన్ పిక్చర్ లో ‘బ్రహ్మోత్సవం’ ఆడియో విడుదల తేదీని మే 7గా ధృవీకరించారు.

ADVERTISEMENT
Latest Stories