ఆహ్లాదకరమైన సంగీతం చెవులకు ఎప్పుడూ ఇంపుగా, వినసొంపుగానే ఉంటుంది. ఆనాటి ఇళయరాజా ‘అధరం మధురం నయనం మధురం’ నుండి మొన్నటి ‘యువరాజు’లో రమణగోగుల ‘అధరం మధురం నయనం మధురం’ వరకు… అలాగే ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’లోని ‘మధురం మధురం’ పాట కూడా… అన్నీ మధురాతిమధురంగానే ఉన్నాయి. చక్కని సాహిత్యానికి ఇంకాస్త సంగీతం జోడిస్తే ఎలా ఉంటుందో ఈ ‘మధురం మధురం’ పాట కూడా అలానే ఉంది.
ప్రిన్స్ మహేష్ బాబు క్లాసీ అండ్ స్టైలిష్ లుక్స్, చిన్న పాప మహేష్ తో చేసిన హావభావాలు, రత్నవేలు ఫోటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ ఆహ్లాదకరమైన సంగీతం ఈ టీజర్లో ప్లస్ పాయింట్స్. ఎలాంటి డివియేషన్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్లుగా ప్రమోషన్స్ ఇవ్వడంతో, పబ్లిసిటీ విషయంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లానింగ్ కు వచ్చినట్లుగా కనపడుతోంది.
టీజర్ సంగతి ఇలా ఉంటే, ఈ సినిమా ఆడియో వేడుకను శిల్పకళావేదిక నుండి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు మార్చినట్లుగా తెలుస్తోంది. శిల్పకళావేదిక కంటే మరింత మంది అభిమానులు పాల్గొనే విధంగా ఉండడంతోనే వెన్యూను మార్చినట్లుగా తెలుస్తోంది. మే 7వ తేదీన అంగరంగ వైభవంగా మధురంగా ‘బ్రహ్మోత్సవం’ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి.



