ఈ సారి క్రిస్‌మస్‌కు ప్రిన్స్ మహేష్‌బాబు, తన కుటుంబ సభ్యులతో కలిసి మంచుకొండల్లో ఎంజాయ్ చేయనున్నారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఈ ఫ్యామిలీ స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ శిఖరాల మీద స్కయింగ్‌తో ఓ కొత్త ఎక్స్ పీరియన్స్‌ని సొంతం చేసుకోనున్నారని, అడ్వంచర్లతో న్యూ ఫీల్‌ని తీసుకురానున్నారట. వీరితో పాటు సన్నిహితులు కూడా ఈ వెకేషన్ లో భాగస్వామ్యం కానున్నారని తెలుస్తోంది.
గౌతమ్‌తో కలిసి స్కై డైవింగ్ చేస్తూ పవర్‌ఫుల్ ఫాదర్‌గా ప్రిన్స్ సరికొత్త ఇమేజ్ ని సంతరించుకుంటాడట. అనంతరం దుబాయ్‌లో ఖరీదైన మాల్స్‌లో షాపింగ్ చేస్తూ తమకిష్టమైన వన్నీ సొంతం చేసుకుంటారని టాక్. క్రిస్‌మస్ సందర్భంగా శాంతాక్లజ్ తమకు బోలెడన్ని గిఫ్ట్‌లు ఇస్తాడని పిల్లలు గౌతమ్, సితార ఇద్దరూ ఆనందంగా చెబుతున్నారు. మొత్తానికి ప్రిన్స్ ఫ్యామిలీ ఈ క్రిస్‌మస్‌కు ఫారెన్‌లో భలేభలే ఎంజాయ్ చేయబోతున్నాడన్నమాట.





