మహేష్ బాబు నుండి ఊహించని ట్వీట్!

Mahesh babu congratualations to U19 Team Indiaతన సినిమాల ప్రమోషన్స్ కు తప్ప సోషల్ మీడియాను పెద్ద వినియోగించని ప్రిన్స్ మహేష్ బాబు నుండి ఈ శనివారం నాడు ఊహించని ట్వీట్ వెలువడింది. అది కూడా సినిమాల గురించి కాకుండా, ‘జెంటిల్మెన్ గేమ్’ అయిన క్రికెట్ గురించి ట్వీట్ చేయడం విశేషం. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించి కప్ ను ఎగురవేసుకుపోయిన సందర్భంగా ఈ ట్వీట్ చేయడం అనేది ప్రిన్స్ నుండి ఊహించని అంశం.

ADVERTISEMENT

దేశానికే గర్వకారణం… అండర్ 19 టీం కుర్రాళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్. క్రికెట్ అంటే మహేష్ బాబుకు ఇష్టం అన్న విషయం బహిరంగమే గానీ, దీని గురించి పెద్దగా ట్వీట్లు చేయరు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సమయంలోనూ మరియు ముంబైలో శ్రీలంకపై టీమిండియా వరల్డ్ కప్ కొట్టిన సందర్భంలోనూ మాత్రమే ట్వీట్లు చేసారు. అంటే ప్రిన్స్ ట్వీట్ చేయాలంటే టీమిండియా వరల్డ్ కప్ కొట్టాల్సిందేనన్న మాట!

ADVERTISEMENT
Latest Stories