ఈ వారమే “స్పైడర్” రిజల్ట్!

mahesh babu fans disappointed with spyderభారీ అంచనాలు నెలకొన్న “స్పైడర్” సినిమాపై ఒత్తిడిని ఒక్కో టీజర్, లిరికల్ సాంగ్స్ తగ్గిస్తూ రావడంతో… ప్రస్తుతం ‘స్పైడర్’ సినిమా ఫలితంపై ప్రిన్స్ అభిమానులు పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లుగా కనపడడం లేదు. ఈ నెల 9వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఆడియో విడుదల చేయనుండగా, దానితో పాటు ట్రైలర్ కూడా విడుదల కావచ్చన్న సంగతి తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఏ విషయం డిక్లేర్ చేయలేదు గానీ, ట్రైలర్ విడుదలైతే మాత్రం, ఈ వారంలోనే దాదాపుగా ‘స్పైడర్’ ఫలితంపై ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేయొచ్చు.

ADVERTISEMENT

ఇప్పటివరకు ఏ ఒక్కటీ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో…. ట్రైలర్ కూడా అదే బాటలో పయనిస్తే, ఇక ప్రిన్స్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురికాక తప్పదు. అయితే ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోవడంతో… “స్పైడర్” ట్రైలర్ మెరుగుగా ఉంటుందన్న అభిప్రాయాలను సినీ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ అభిమానగణం ఉన్న ‘నెగటివ్’ పరిస్థితి నుండి బయటపడేసే విధంగా ట్రైలర్ ఉంటే, దసరా వీకెండ్ కు బాక్సాఫీస్ వద్ద అసలైన సరదా తీర్చుకోవచ్చన్నది ట్రేడ్ పండితుల భావన.

ADVERTISEMENT
Latest Stories