‘రీల్’ లైఫ్ లోనే కాదు ‘రియల్’ లైఫ్ లోను హీరో అయ్యారు మహేష్ బాబు.!

mahesh babu foundation done 30 heart surgeries for childrenచిన్నారుల ప్రాణాలను కాపాడుతూ మహేష్ బాబు అటు రీల్ లైఫ్ లోనే కాదు ఇటు రియల్ లైఫ్ లోను “హీరో” అనిపించుకుంటున్నారు. “మహేష్ బాబు ఫౌండేషన్” పేరుతో ఏంతో మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోను పలు అసుపత్రులతో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ క్రమంలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒకే రోజు 30మందికి శస్త్ర చికిత్సలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ నందు మహేష్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు వైద్యులు. ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా ఆచిన్నారుల తల్లితండ్రుల మనస్సులో నిజంగా హీరో స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు.

ADVERTISEMENT

ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు సంబందించిన పిక్స్ ను మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. నమ్రత ఈ కార్యక్రమానికి సహకరించిన ఆంధ్ర హాస్పిటలల్స్ వారికి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ పిక్స్ చూస్తూ ఊరికే ఉండరు కదా మహేష్ అభిమానులు. లైక్స్., షేర్స్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు ప్రిన్స్ ఫాన్స్.

ADVERTISEMENT
Latest Stories