ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతోన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షెడ్యూల్ ఇటీవలే పూర్తి కాగా, తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ తో చిత్ర టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సినీ సమాచారం. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” అనే సినిమాలో ప్రిన్స్ నటిస్తున్న విషయం ఇప్పటికే అధికారికమైంది.
ఈ చిత్రంపై చర్చోపచర్చలు చేసేందుకు దర్శకుడు కొరటాల శివతో కలిసి మహేష్ బ్యాంకాక్ పయనమయ్యారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెక్స్ షర్టు వేసుకుని ఉన్న ప్రిన్స్ లుక్ అభిమానులకు అదిరిపోయే విధంగా ఉండడంతో, ఈ ఫోటోల సందడి ఎక్కువైంది. తన కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడంతో, సోషల్ మీడియాలో లీక్ అవుతున్న ఈ ఫోటోలతోనే అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



