పిక్ టాక్ – దీపావళి అంతా ప్రిన్స్ ఇంట్లోనే ఉన్నట్టుంది!

mahesh-babu-house-diwali-lighting“దీపావళి వేడుకలను జరుపుకోవడం తనకు చిన్నతనం నుండి అలవాటని, చెన్నైలో ఉన్నపుడు క్రాకర్స్ ను బాగా కాల్చేవాడిని” ప్రిన్స్ మహేష్ బాబు గతంలో చెప్పిన సందర్భాలున్నాయి. ఇది నిజమనిపించే విధంగా హైదరాబాద్ లోని తన ఇంటిని ముస్తాబు చేయించారు ప్రిన్స్. భవనం అంతా డెకరేషన్ లైట్స్ వెలుగు జిలుగులతో తళతళలాడిపోతోంది. చూడబోతుంటే దీపావళి శోభ అంతా రెండు రోజుల ముందే మహేష్ ఇంటికి చేరుకున్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

మహేష్ కు ఈ దీపావళి మరింత స్పెషల్ కానుంది. పండగ వాతావరణం ఒకటైతే, మురుగదాస్ దర్శకత్వంలో తను నటిస్తున్న ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఈ దీపావళికి కనువిందు చేయనున్నాయి. దీంతో మహేష్ కుటుంబం అంతా ఉత్సాహభరితమైన వాతావరణంలో మునిగి ఉంది. ప్రిన్స్ అభిమానులు కూడా కొత్త సినిమా టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది.

ADVERTISEMENT
Latest Stories