మోడీ సూట్ లో మహేష్ బాబు!

Mahesh Babu in Narendra Modi Suitనరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయన ధరించిన సూట్ ఓ ‘ట్రెండ్ సెట్టర్’గా మారిన విషయం తెలిసిందే. నిజానికి ఆ తరహా డ్రెస్ కు ఏకంగా ‘మోడీ సూట్’ అంటూ మార్కెట్ వర్గాలు నామకరణం చేసేసాయి. అప్పటివరకు ఉన్న ప్రధానమంత్రులు ధరించిన డ్రెస్ లకు విభిన్నంగా మోడీ సూట్ ను తయారు చేయించుకోవడంతో, ఆ సూట్ కు ‘మోడీ’ పేరు వచ్చేసింది. అయితే ప్రధానమంత్రులే కాదు, ముఖ్యమంత్రులు కూడా ఈ సూట్ ను ధరించుకోవచ్చని ప్రిన్స్ మహేష్ బాబు చెప్తున్నారు.

ADVERTISEMENT

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి గెటప్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. దీంతో సిఎం లుక్ లో మహేష్ బాబు ఎలా ఉంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి సోషల్ మీడియాలో ఓ ఫోటో తారసపడింది. మోడీ సూట్ ధరించి దర్శనమిచ్చిన మహేష్ బాబు లుక్ అదిరింది. అన్నపూర్ణ స్టూడియోస్ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా, ఈ ఫోటో సోషల్ మీడియాకు ఎక్కడంతో, ప్రిన్స్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories