‘మహేష్’కి నచ్చిన ‘మెగా హీరో’ ఫ్లాప్ సినిమా!

mahesh babu likes varun tej mukundha movieఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలకు అవకాశం రావాలంటే… వారు దర్శకత్వం వహించిన మునుపటి సినిమా సక్సెస్ అయి తీరాల్సిందే. ఇందులో వేరే అభిప్రాయానికి తావు లేదు. ఎక్కువ శాతం మంది హీరోల పరిస్థితి ఇదే అయినప్పటికే ప్రిన్స్ తీరు మాత్రం కాస్త వైరైటీ. సక్సెస్ మాట ఎలా ఉన్నా ప్రతిభకు ప్రాధ్యాన్యత ఇస్తారన్న పేరు ఉన్న ప్రిన్స్ ‘బ్రహ్మోత్సవం’ ద్వారా శ్రీకాంత్ అడ్డాలకు ఓ అవకాశం ఇచ్చారన్న అంశం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన మునుపటి చిత్రం ‘ముకుందా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ ను అందుకోకపోవడమే దీనికి కారణం. అయితే ఇదే విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు వద్ద ప్రస్తావించినపుడు… శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలలో సన్నివేశాలు చాలా రియాలిటీగా ఉంటాయని, ‘ముకుందా’ సినిమాలో కూడా శ్రీకాంత్ గారి మార్క్ కనపడిందని, తనకు ‘ముకుందా’ నచ్చిందంటూ కితాబిచ్చారు.

ADVERTISEMENT

తన జీవితంలోనో, తనకు తెలిసిన వారి జీవితంలోనో జరిగిన సన్నివేశాలను శ్రీకాంత్ అడ్డాల స్పూర్తిగా తీసుకుని కధగా మలుచుకుంటారని, అందుకే శ్రీకాంత్ సినిమాలలో కధ సింపుల్ గా ఉన్నప్పటికీ, సన్నివేశాలు బలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ, ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో మిమ్మల్ని శ్రీకాంత్ ఆశ్చర్యపరుస్తారంటూ ప్రిన్స్ చెప్పిన సంగతులు అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories