‘కంత్రీ, షాడో, శక్తి’ వంటి దారుణ పరాజయాల దర్శకుడు మెహర్ రమేష్ తో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు అనేది పాత మాట. అప్పట్లో ప్రిన్స్ తో పాటు సన్నిహితంగా ఉండడంతో, అది సినిమా కోసం ఏర్పరచుకున్న సంబంధం అని అంతా భావించారు. అయితే ఆ రిలేషన్ సినిమాది కాదు, కుటుంబానిదని తర్వాత కాలంలో తెలిసి వచ్చింది. ప్రస్తుతం మహేష్ ఎక్కడ ఉన్నా, ఆయన వెనుక మెహర్, మహేష్ తనయురాలు సితార ఎక్కడా ఉన్నా ఆమె ముందు మెహర్ తనయురాలు దర్శనమిస్తున్నారు.
అయితే అంతలా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి కారణం ఏంటి? అంటే దానికి ప్రత్యేక కారణాలు లేవు గానీ, మెహర్ సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళ నుండి ప్రిన్స్ తో మంచి సంబంధాలు ఉండడమేనని తెలుస్తోంది. ‘బాబీ’ చిత్రంలో రీల్ లైఫ్ లో ప్రిన్స్ పక్కన కమెడియన్ రోల్ లో కనిపించిన మెహర్, ప్రస్తుతం రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తున్నారు, అయితే కమెడియన్ గా మాత్రం కాదు. మరి ఏ రోల్ ను మెహర్ కు మహేష్ అందజేశాడు అంటే… దానికి సమాధానమే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న స్కూల్ అని తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో మహేష్ ఓ అంతర్జాతీయ స్కూల్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ పనులను మెహర్ రమేష్ కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మహేష్ సినిమాలు, ఫ్యామిలీతో బిజీగా ఉండగా, నమ్రత మహేష్ డేట్స్ ను, బ్రాండ్స్ ను, అలాగే దత్తత తీసుకున్న గ్రామాల సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో అమరావతిలో ఏర్పాటు చేయనున్న స్కూల్ యొక్క నిర్వహణను మెహర్ కు అప్పచేప్పినట్లుగా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో డైరెక్షన్ కు మెహర్ గుడ్ బై చెప్పేసినట్లేనని ఖరారైన విషయం.


