‘మురుగదాస్ – మహేష్’ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోందండోయ్..!

mahesh-babu-murugadoss-movie-first-look-releaseఇదిగో పులి… అదిగో ‘మేక’… అన్న కధ విన్నారా..! మురుగదాస్ – మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సంగతి కూడా అలాగే ఉంటోంది. అక్టోబర్ మొదటి వారంలో దసరా పండగ సందర్భంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది అంటూ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూసారు. అయితే… తూచ్… దసరాకు కాదు, తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన దీపావళి, అమావాస్య నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు చిన్న టీజర్ కూడా విడుదల అవుతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అంతేకాదు, ప్రముఖ జాతీయ దినపత్రికలు అయితే 10 సెకన్ల టీజర్ కోసం లండన్ లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం చేయిస్తున్నారని కధనాలను ప్రసారం చేసింది. దీంతో ప్రిన్స్ అభిమానులు ఈ సారి పక్కగా ల్యాండ్ అవుతుందని భావించారు. అయితే పండగ సందర్భంగా విడుదల అవుతుందనుకున్న చాలా సినిమాల ఫస్ట్ లుక్ లు ఆయా హీరోల అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేసాయి. కానీ, ప్రిన్స్ అభిమానులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.

ADVERTISEMENT

మరో పక్కన కనీసం అసలు విడుదల అవుతుందా? లేదా? అన్న సమాచారం కూడా అటు దర్శకుడు మురుగదాస్ గానీ, ఇటు హీరో మహేష్ బాబు గానీ, నిర్మాతలు ఠాగూర్ మధు గానీ ఎవ్వరూ అందివ్వలేదు. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా కనపడుతోంది. టాప్ హీరోల ఫస్ట్ లుక్ లన్నీ వచ్చేస్తుంటే… సోషల్ మీడియాలో మురుగదాస్ ను ప్రశ్నించడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది. దాదాపు పండగ సమయం తుది దశకు వచ్చేసింది, ఇప్పటివరకు సమాచారం లేకపోవడంతో, దసరా మాదిరే దీపావళికి కూడా ప్రిన్స్ హ్యాండ్ ఇవ్వబోతున్నారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

ఇక, దీపావళి మిస్సయితే, చిత్ర యూనిట్ కు మిగిలింది సంక్రాంతి మాత్రమే! సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పబ్లిసిటీ ఊపందుకోవాలంటే… సంక్రాంతికి ఖచ్చితంగా టీజర్ విడుదల అవుతుందని చెప్పవచ్చు. దీంతో ఈ దీపావళి కూడా ప్రిన్స్ అభిమానులకు నిరీక్షణే మిగిల్చింది. లేదంటే… లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఏమైనా ఇస్తారేమోనన్న ఆలోచన, ఆశలలో కూడా ప్రిన్స్ అభిమానులు ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories