మురుగదాస్ – మహేష్ సినిమా ఫస్ట్ రికార్డ్!

maheshస్టార్ హీరోలకు ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా, మళ్ళీ కొత్త సినిమాకు వచ్చేపాటికి ఫ్యాన్సీ ఆఫర్లు దక్కుతుంటాయి. అలాగే ప్రిన్స్ మహేష్ బాబుకు ‘బ్రహ్మోత్సవం’ రూపంలో వెండితెరతో పాటు, బుల్లితెరపై కూడా భారీ డిజాస్టర్ చవిచూసినా, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాకు రికార్డ్ స్థాయిలో శాటిలైట్ హక్కులు పలికినట్లుగా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోన్న సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను మరియు తెలుగు శాటిలైట్ హక్కులను కలిపి దాదాపుగా 26.5 కోట్లకు ప్రముఖ టెలివిజన్ సంస్థ ‘జీ’ గ్రూప్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తంలో 5 కోట్లు హిందీ డబ్బింగ్ హక్కులకు కాగా, 21 కోట్లు కేవలం శాటిలైట్ హక్కులకు వెచ్చించినట్లుగా లెక్కలు కడుతున్నారు.

ADVERTISEMENT

ఈ లెక్కలే నిజమైతే తెలుగు శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ హక్కుల విషయంలో ఆల్ టైం రికార్డులు సృష్టించిన సినిమాగా ఈ అన్ టైటిల్డ్ సినిమా నిలుస్తుంది. ఇప్పటివరకు ఒక్క ‘బాహుబలి’ సినిమాకు మాత్రమే రెండు పార్టులకు కలిపి దాదాపుగా 30 కోట్లు వెచ్చించారు. దీంతో విడుదలకు ఆరు నెలల ముందు నుండే మురుగదాస్ సినిమా రికార్డుల ఖాతాను ఓపెన్ చేసినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories