గ్రేట్ న్యూస్ ఫర్ ప్రిన్స్ ఫ్యాన్స్!

Mahesh Babu New Hairstyle Brings Hope!ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. గత నాలుగు సినిమాల నుండి ఒకే తరహా లుక్స్ అండ్ యాక్షన్ తో ఉన్న ప్రిన్స్, తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపిస్తానని చెప్పింది పాత వార్తే. అయితే ప్రస్తుతం కార్యరూపం సిద్ధించుకుంటోందన్నది సరికొత్త న్యూస్. మహేష్ ఇప్పటివరకు నటించిన 24 సినిమాలలో ఎన్నడూ కనిపించని రీతిలో 25వ సినిమా కోసం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

గడ్డంతో పాటు లాంగ్ హెయిర్ లో మహేష్ బాబు లుక్ ఉండబోతుందని సమాచారం. మహేష్ ఎక్కువగా షార్ట్ హెయిర్ తోనే కనిపించారు. ‘అతిధి’లో కాస్త లాంగ్ హెయిర్ కనిపించినా, అది వర్కౌట్ కాలేదు. ఇప్పటివరకు ‘పోకిరి’ సినిమాలోనే బెస్ట్ లుక్ గా ఉంది. అయితే 25వ సినిమాలో మాత్రం సరికొత్తగా కనిపించనుండడం సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు అత్యంత ఆనందదాయకమైన విషయం కదా! ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది గానీ, మహేష్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై క్లారిటీ లేదు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories