మహేష్ ను పిలిచే ఛాన్స్ లేదు!

Few-Websites-Head-over-Heel-Confusion-on-Mahesh-Babuఎన్ని పుకార్లు షికార్లు చేసినా ప్రిన్స్ మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ అనే దానిపై మహేష్ తో సహాఅభిమానులకు కూడా ఫుల్ క్లారిటీ ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం… రాజకీయాలపై ఆది నుండి మహేష్ అవలంబిస్తున్న విధానమే! అయితే గత ఎన్నికలలో తన బావ గల్లా జయదేవ్ కు అనుకూలంగా ఓటు వేయాలని మహేష్ ఓ ట్వీట్ వేసిన వైనం తెలిసిందే. ఈ ప్రచారాన్ని కేవలం ట్విట్టర్ వరకే పరిమితం చేసారు తప్ప ప్రత్యక్షంగా బరిలోకి దిగలేదు. నిజానికి అదే మంచిది అయ్యిందంటూ తాజాగా ఇంటర్వ్యూలో గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.

గత ఎన్నికల్లో మహేష్ ప్రచారానికి రాకుండానే గెలవడం మంచిదని తాను భావిస్తున్నానని, అలాగే 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా తన తరపున ప్రచారం చేయాలని మహేష్ బాబును కోరబోనని, ఎలాంటి ఒత్తిడి చేయబోనని గల్లా స్పష్టం చేసారు. ప్రముఖ మీడియా ఛానల్ వీకెండ్ ఇంటర్వ్యూలో భాగంగా ప్రసారం చేసే ఈ కార్యక్రమం ఈ ఆదివారం నాడు బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి.

ADVERTISEMENT

అలాగే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలపై కూడా గల్లా జవాబిచ్చారు. “కొందరు ఎంపీలు పదవిని అనుభవిస్తూనే వ్యాపారాలు చేసుకుంటున్నారని” పవన్ అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ…. తమ పోరాటం తాము చేస్తున్నామని, అయితే తమను వదిలేస్తే పోరాడగలం గానీ, చేతులు కట్టేసి పోరాడమంటే ఎలా అంటూ బదులిచ్చారు. ఈ ఇంటర్వ్యూలో గల్లా సోదరిమణి డాక్టర్ రమాదేవి కూడా భాగస్వామ్యులయ్యి, గల్లా జయదేవ్ గురించి పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

ADVERTISEMENT
Latest Stories