స్పైడర్… ఇది అదిరింది..!

mahesh babu - Rakul Preet Singh Spyder song!షూటింగ్ దశలో ఉన్నంత వరకు అసలు ‘లీక్’ అనేది లేకుండా జాగ్రత్తపడ్డ “స్పైడర్” టీం, చివరి నిముషంలో ఆ పట్టు చేజారిపోయిందా? అన్న సంకేతాలను ఇస్తోంది. ఇటీవల ‘స్పైడర్’ టైటిల్ కార్డ్స్ వీడియో అంటూ యూ ట్యూబ్ లో ఓ వీడియో హల్చల్ చేయగా, దానిని చిత్ర యూనిట్ ఖండిస్తూ, అది ‘స్పైడర్’కు సంబంధించినది కాదని తెలిపింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ప్రిన్స్ అభిమానగణానికి, ఫుల్ ఆడియో ఆల్బమ్ అధికారికంగా విడుదల చేయడాని కంటే ముందే లీక్ అయ్యింది.

ADVERTISEMENT

ఆడియో సంగతి పక్కన పెడితే, వీడియో పరంగా ప్రిన్స్ అభిమానులను ఖుషీ చేయడానికి, తమిళ వర్షన్ కు చెందిన ‘సిస్లియా’ పాటను విడుదల చేసారు. ఈ సినిమా తమిళ హక్కులు తీసుకున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ, 10 సెకన్ల నిడివి కలిగిన ‘సిస్లియా’ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆడియోకు హైలైట్ గా నిలిచిన ఈ పాట విజువల్ గా కూడా అదిరిపోయింది అన్న సంకేతాలను ఈ చిన్న టీజర్ ఇచ్చింది. యూ ట్యూబ్ లో అధికారికంగా ఆడియో వేడుకపై విడుదల చేస్తారేమో గానీ, ప్రస్తుతానికి నెట్టింట మాత్రం సందడి చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories