రామ్ చరణ్ కు తమ్ముడిగా మహేష్ బాబు!

mahesh babu ram charan family foreign tour2017వ సంవత్సరం సినీ అభిమానులకు కొత్తధనాన్ని పంచనుందన్న విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు చెప్పకనే చెప్తున్నారు. తమ మధ్య సఖ్యత, చక్కని సంబంధం ఉందనే విధంగా ప్రిన్స్ ఫ్యామిలీ, చెర్రీ ఫ్యామిలీ కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే కొన్ని ఫోటోలు హల్చల్ చేయగా, తాజాగా మరొక ఫోటో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

మహేష్ పై చేయి వేసి ఉన్న రామ్ చరణ్ ఫోటో ఇద్దరి హీరోల అభిమానులకు కన్నుల విందుగా మారింది. గుబురు మీసం, గడ్డంతో చెర్రీ దర్శనమిస్తుండగా, చెర్రీ తమ్ముడి మాదిరిగా లేలేత యువకుడిగా కనపడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. నిజంగా ఈ ఫోటోను పక్కనపెట్టి, వయసులో ఎవరు పెద్ద వారు? అంటే టక్కున చెర్రీ అన్న పేరు చెప్పడం సహజం… అనేటంతగా ప్రిన్స్ మెరిసిపోతున్నాడు. 2017 స్పెషల్ గా ఈ ఫోటోలు ఐ ఫీస్ట్ గా మారాయి.

ADVERTISEMENT
Latest Stories