తన కుటుంబానికి ప్రిన్స్ ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిన విషయమే. వీలు చిక్కినప్పుడల్లా… కాదు కాదు… వీలు కల్పించుకుని మరీ కుటుంబంతో సహా విదేశాల్లో షికార్లు చేయడం ప్రిన్స్ ఫ్యామిలీకి పరిపాటి. తాజాగా కూడా యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత కుటుంబంతో కలిసి యూకే చెక్కేసిన మహేష్ కుటుంబం ఇటీవలే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ప్రిన్స్ సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్ లు ప్రిన్స్ ‘శ్రీమంతుడు’ సినిమాలో తొక్కిన సైకిల్ మాదిరి ఇద్దరూ సైకిల్స్ తొక్కుతూ సందడి చేస్తున్న ఫోటోలు మరియు ఎయిర్ పోర్ట్ లో ప్రిన్స్ గారాలపట్టి సితారను ట్రాలీలో కూర్చోపెట్టుకుని మహేష్, గౌతమ్ లిద్దరూ తీసుకువెళ్తున్న ఫోటోలను ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
సాధారణంగా సితార ఉన్న ఫోటోలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సందర్భంలో కూడా సితార ట్రాలీలో కూర్చున్న ఫోటో బాగా హల్చల్ చేస్తోంది. చూడబోతుంటే… మహేష్ కుటుంబంలో సితారను ఒక ‘మహారాణి’లా చూసుకుంటారని అర్ధమవుతోంది. గతంలో గౌతమ్ – సితారల ఫోటోలు, మహేష్ – సితారల ఫోటోలు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్షించేవి.



