ఇది ‘స్పైడర్’ సర్ ప్రైజ్!

Mahesh Babu Spyder Malayalam Teaserతెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” సినిమా, తాజాగా మరో భాషను పెంచుకుంది. మొన్నటివరకు హిందీలో విడుదల చేయడానికి ప్లానింగ్ జరుగుతోందన్న ఊహాగానాలు చెలరేగగా, ఇంతవరకు హిందీపై స్పష్టత రాలేదు గానీ, దక్షిణాదిలోనే మరో భాష అయిన మలయాళంలోకి ఈ సినిమా డబ్ అవుతుందన్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

అంతేకాదు, ఈ సినిమా మలయాళ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని చెప్పి, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. అయితే ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసిన టీజర్ కే డబ్బింగ్ చెప్పి మలయాళంలో విడుదల చేస్తారా? లేక ఫ్రెష్ టీజర్ ను కట్ చేసి వదులుతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మునుపటి టీజర్ కంటే ఫ్రెష్ టీజర్ అయితేనే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న “స్పైడర్”ను హిందీలోకి కూడా తర్జమా చేసేస్తే… “బాహుబలి” తర్వాత, నాలుగు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల అవుతున్న సినిమాగా రికార్డులకెక్కుతుంది. అయితే హిందీలో మార్కెట్ పై ఒక్క మురుగదాస్ కు తప్ప ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో, హిందీలోకి డబ్ చేయాలా… వద్దా… అనే మీమాంసలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories