‘స్పైడర్’ ఆడియో ట్రాక్ లిస్ట్!

mahesh babu spyder movie track listతమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “స్పైడర్” సినిమా ఆడియో వేడుకకు రంగం సిద్ధమైంది. శనివారం నాడు సాయంత్రం కలైవనార్ అరంగం, చెన్నైలో అంగరంగ వైభవంగా ఈ వేడుకకు జరిపేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా భారీ అభిమానగణం ‘చలో చెన్నై’ అన్న నినాదాన్ని అందుకుంటున్నారు. ఇప్పటికే ‘బూమ్ బూమ్ మరియు హాలి హాలి’ అనే రెండు పాటలు విడుదల కాగా, అవి కాకుండా మరో మూడు పాటలు ఈ ఆల్బమ్ లో ఉన్నాయి.

ADVERTISEMENT

తొలుత విడుదలైన రెండు పాటలలో ‘బూమ్ బూమ్’ పాట ఓకే అనిపించగా, రెండవది మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో రాబోయే మూడు పాటలలో కనీసం ఓ రెండైనా బాగుంటాయా అన్న ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలి రెండు పాటలలో తెలుగుదనం లోపించిందని భావించిన శ్రోతలకు మిగిలిన పాటలలో అయినా అది కనిపిస్తుందో లేదో గానీ, ట్రాక్ లిస్ట్ లో అయితే తెలుగుదనం ఉట్టిపడుతోంది. రేపు విడుదల కాబోతున్న ఈ ఆడియో ట్రాక్ లిస్ట్…
1) బూమ్ బూమ్

2) హే పిల్ల

3) హాలి హాలి

4) అచ్చం తెలుగుదనం

5) స్పైడర్ ఆన్ మిషన్

ADVERTISEMENT
Latest Stories