ఆన్ టార్గెట్ – ‘జై లవకుశ’ 2 x ‘స్పైడర్’ 1

Mahesh Babu Spyder Vs Ntr Jai lava kusaదసరా బరిలో నిలిచిన రెండు పెద్ద సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. టీజర్స్ వచ్చిన దాన్ని బట్టి ఒక మెట్టు “జై లవకుశ” సినిమా ముందు వరుసలో నిలువగా, అంచనాలను అందుకోలేక “స్పైడర్” రెండవ స్థానంలో ఉంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఇంకా పూర్తి కాలేదన్న విషయం తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాకు సంబంధించి ఇంకా ఒక పాట మిగిలి ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమాకు సంబంధించి రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది.

విశేషం ఏమిటంటే… ఈ మూడు పాటలు కూడా విదేశాల్లో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ‘స్పైడర్’ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా, ‘జై లవకుశ’ షెడ్యూల్ వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీ నుండి రుమేనియాలో ‘స్పైడర్’ ఒక్క పాటను చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది, ఇక విడుదలకు అన్నీ అడ్డంకులు తొలగినట్లు అవుతుంది. ‘జై లవకుశ’కు మాత్రం రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా, ‘స్పైడర్’ కంటే ఒక వారం ముందే విడుదల కావాల్సి ఉంది.

ADVERTISEMENT

అయితే ‘జై లవకుశ’కు రెండు పాటలు ఉన్నా, ‘స్పైడర్’ ఒక్క పాటతో సమానం అనే చెప్పవచ్చు. ‘స్పైడర్’ తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాల్సి ఉండగా, ‘జై లవకుశ’ మాత్రం తెలుగులో మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కావడంతో, అనుకున్న సమయానికి విడుదల కావడం తధ్యం అని చెప్పవచ్చు. దీంతో దసరా పండగ సినీ ప్రేక్షకుల సరదాను తీర్చేయడం ఖాయం. మాస్ ఎంటర్టైనర్ గా ఎన్టీఆర్ వస్తుండగా, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు రానున్నాడు. మరి వీరిద్దరిలో ‘విన్నర్’ ఎవరో… ఎవరెంటారు..!?

ADVERTISEMENT
Latest Stories