మొన్న ఆ మధ్య మహేష్ బాబు త్రివిక్రమ్ ల మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని.. వారు ఇక నుండి కలిసి పనిచెయ్యరని గట్టిగా వదంతులు వ్యాపించాయి. అయితే దీనిపై అటు మహేష్ గానీ ఇటు త్రివిక్రమ్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే చాలా రోజుల తరువాత మహేష్ ఒక ట్వీట్ తో దీని పై ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చారు.
ఇవాళ్టికి “ఖలేజా” సినిమా విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేశాడు. నటుడిగా తనలో ఓ కొత్త కోణాన్ని ఆ సినిమా చూపించిందని చెబుతూనే.. త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు.. త్రివిక్రమ్ తో మూవీ కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే అది సాకారం అవుతుందంటూ ట్వీట్ చేశాడు.
దీనితో వారిమధ్య ఏమీ జరగలేదని… జరిగినా ఇప్పుడు అన్నీ సమసిపోయాయనే క్లారిటీ ఇచ్చేశాడు మహేష్. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం తన తరువాతి సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొదలుపెట్టడానికి వేచి చూస్తున్నాడు.
సర్కారు వారి పాటను మేలో ప్రకటించినట్లు మన పాఠకులకు తెలుసు, కాని కరోనావైరస్ పాండమిక్ కారణంగా ఈ చిత్రం ఇంకా షూట్ ప్రారంభించలేదు. నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లవచ్చని మనకున్న సమాచారం. కథలో కొంత భాగం యుఎస్ఎ నేపథ్యంలో సెట్ చేయబడిందని మరియు డెట్రాయిట్ నగరాన్ని ప్రధాన షూటింగ్ ప్రదేశంగా పరిగణిస్తున్నారు.




