“మహర్షి” టీం నుండి పిక్ రిలీజ్!

Mahesh Babu with fan MAHARSHI shooting in newyorkన్యూయార్క్ లో షూటింగ్ జరుగుతోన్న వంశీ – మహేష్ ల “మహర్షి” సినిమా నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఇది చిత్రానికి సంబంధించిన పోస్టర్ కాదు, కేవలం మహేష్ వ్యక్తిగత పోస్టర్ మాత్రమే. ప్రిన్స్ ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చే జిమ్ కోచ్ న్యూయార్క్ చేరుకున్న సందర్భంగా మహేష్ తో కలిసి ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

ADVERTISEMENT

[m9ad]

న్యూయార్క్ లోని పాపులర్ ప్రదేశం అయిన టైమ్స్ స్క్వేర్ లో నిల్చుని ఉన్న ఈ పోస్టర్ లోని మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్లాక్ గాగుల్స్ తో చార్మింగ్ లుక్ లో మహేష్ మెరిసిపోతున్నాడు. రెండు విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్న ఈ “మహర్షి”ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ADVERTISEMENT
Latest Stories