ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మంచు కొండల్లో మహేష్, నమ్రత, గౌతమ్, సితారలు చక్కగా ఆడిపాడుతున్నారు. ముఖ్యంగా మహేష్, సితారలు ఉన్న ఫోటోలను ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు.
సితార చేసే చిలిపి చేష్టలు, ముఖ కవళికలు ముద్దోస్తూ వీక్షకులను అలరిస్తున్నాయి. అలాగే గౌతమ్ ‘స్నో డ్రైవ్’ చేస్తున్న ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త సంవత్సర వేడుకలను కూడా ప్రిన్స్ విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
ADVERTISEMENT





