గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మహేష్ కత్తి మధ్య పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఇంకా ఓ కొలిక్కి రాకముందే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చింది. దీంతో మళ్ళీ ఎలాంటి సంచలన కామెంట్స్ చేస్తారో అంటూ మహేష్ కత్తి ఫేస్ బుక్ పైకి నెటిజన్లు వీక్షించగా, అలాంటి వాటికి తావు లేకుండా సింపుల్ గా ‘పవర్ స్టార్’కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తన ఉద్దేశాన్ని పవన్ ఫ్యాన్స్ కు తెలియజేసాడు మహేష్ కత్తి.
“మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శతృత్వం నాకు ఎందుకుంటుంది?” అంటూ పోస్ట్ చేసిన మహేష్ కత్తి, ఓ వీడియోను ఈ సందర్భంగా పోస్ట్ చేసారు. రాజకీయ రంగంలో పవన్ కొందరివాడిగా కాకుండా అందరివాడిగా మిగిలిపోవాలని కోరుకుంటున్నానని చెప్తూ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బహుశా ఈ రెండింటితో మహేష్ కత్తిపై పవన్ అభిమానులు చేపట్టిన యుద్దాన్ని నిలుపుదల చేస్తారేమో చూడాలి. అయితే దీనిని అర్ధం చేసుకునే స్థితిలో పవన్ ఫ్యాన్స్ ఉన్నారా? లేదో? కాలమే నిర్ణయించాలి.


