కక్ష గట్టి ‘రివ్యూ’లు ఇస్తామా!

Mahesh Kathi o Reviews controversyజూనియర్ ఎన్టీఆర్ ‘రివ్యూ’ల మీద చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ‘రివ్యూ’లపై రచ్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే ప్రిన్స్ మహేష్ బాబు ఇదే ‘రివ్యూ’లపై సింపుల్ గా తేల్చేయడంతో… ఇది మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ‘బిగ్ బాస్’ షో తర్వాత సెలబ్రిటీగా మారిపోయిన మహేష్ కత్తి, ఈ రివ్యూల ప్రభావం ప్రేక్షకులపై ఏ విధంగా ఉందో, అలాగే తాము విశ్లేషణలు ఎలా చేస్తామో అన్న అంశాలపై స్పందించారు.

ADVERTISEMENT

గ‌త ఏడాది ‘బిచ్చ‌గాడు’ అనే సినిమా వ‌చ్చింద‌ని, ఆ సినిమాపై ఒక్క‌రు కూడా రివ్యూలు రాయ‌లేద‌ని, ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింద‌ని గుర్తు చేసిన మహేష్ కత్తి, చిన్న సినిమాలుగా విడుదలైన ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలపై కూడా రివ్యూలు బాగానే రాశార‌ని అన్నారు. ఒకవేళ అలా బాగా రాయలేని సినిమాల‌పై ఎవ‌రైనా కక్ష ‌గట్టి రివ్యూలు రాస్తారా? అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్ర‌శ్నించారు.

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అభ‌ద్ర‌తా భావంతోనే త‌మ‌పై కొంద‌రు సినీ వర్గాల వారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, తాము కూడా ప్రేక్ష‌కుల లాంటి వారిమేన‌ని, కాక‌పోతే సినిమాల‌ను విశ్లేషించ‌గ‌ల‌మ‌ని, సినిమాను అమితంగా ప్రేమించాం కాబ‌ట్టే తాము విశ్లేష‌కులమ‌య్యామ‌ని, తమ బాధ్యత అక్కడ వరకే పరిమితమైందని చెప్పుకొచ్చారు.

అయితే విశ్లేష‌కుల‌ను వ‌చ్చి సినిమా తీయ‌మ‌నండ‌ని కొంద‌రు అంటున్నార‌ని, త‌మ ప‌ని సినిమాలను విశ్లేషించ‌డమేనని, సినిమా బాగుంటే బాగుంద‌ని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తామ‌ని అన్నారు. అంతేగానీ సినిమా గురించి అన్నీ తెలుస‌ని తామేం విర్ర‌వీగ‌డం లేద‌ని అన్నారు. మహేష్ కత్తి చెప్పినట్లు… రివ్యూలను కక్షగట్టి ఎవరు ఇవ్వరు… ఒకవేళ ఇచ్చినా వాటికి ప్రాధాన్యత లభించదన్న విషయం సదరు హీరోలు, వారి అభిమానులు కూడా గమనించాలి.

ADVERTISEMENT
Latest Stories