టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వ్యక్తిగత ఫోటోలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. కానీ, ప్రిన్స్ సతీమణి నమ్రత శిర్కొదర్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న రీత్యా… అభిమానులను కనువిందు చేసేలా ఇటీవల కాస్త ఎక్కువగానే ఫోటోలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, పిల్లలతో గడిపిన ఫోటోలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అప్పుడప్పుడు అభిమానులతో కలిసున్న స్నాప్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి.
అందులో భాగంగానే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మామూలు ఫోటోలకు, ఈ ఫోటోకు ఉన్న తేడా ఏంటో ఈ ఫోటో చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. ఎప్పుడూ నిండుగా కనపడే ప్రిన్స్, తొలిసారి షార్ట్స్ లో దర్శనమిచ్చాడు. వాకింగ్ షూస్ తో, వాటర్ బాటిల్ పట్టుకుని కనపడుతున్న ప్రిన్స్, బహుశా వాకింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్నారో ఏమో గానీ, ఫ్యాన్స్ కు మాత్రం చాలా కొత్తగా కనపడుతున్నారు.
అయితే ఈ స్టిల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మురుగదాస్ సినిమాలోది అయితే అభిమానులకు మరింత పండగే అని చెప్పవచ్చు. ‘మహేష్ ను ఖచ్చితంగా కొత్తగా చూస్తారు’ అని దర్శకుడు మురుగదాస్ బల్లగుద్ది చెప్పిన నమ్మకాన్ని ఈ ఫోటో నిజం చేస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రిన్స్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.




