వైరల్ అవుతోన్న రణబీర్ – మహీరాల మధ్య వీడియో!

Mahira Khan pleading with Ranbir Kapoorబాలీవుడ్ యువ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ – పాకిస్థాన్ హీరోయిన్ మహీరా ఖాన్ మధ్య చోటుచేసుకున్న ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణ్ బీర్ కపూర్ దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళగా, ఆ సమయంలో పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ కూడా సదరు కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో వారిద్దరూ కలిసి ఫోటోలకు పోజులిస్తూ… రెడ్ కార్పెట్ పై నడిచి ఆకట్టుకున్నారు.

అయితే, ఇదంతా స్టేజ్ మీద చోటుచేసుకున్న విషయం. అనంతరం హోటల్ రూంలో మరో ఘటన చోటుచేసుకుంది. రణబీర్ కపూర్ అసహనంతో ఉండగా, మహీరా ఖాన్ అతనిని బతిమాలుతోంది. తప్పు జరిగిపోయింది, క్షమించమని వేడుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ముగ్గురు ఖాన్ లతో నటించేది లేదని, ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్ చేస్తే కేన్సర్ వస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు చేసి, మహీరా ఖాన్ సృష్టించిన హంగామా తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories