షాకింగ్ – హీరోయిన్ భావన కిడ్నాప్… లైంగిక వేధింపులు…!

Malayalam Actress Bhavana Kidnapped and molested in Kochi‘ఒంటరి’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన భావన అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నితిన్ తో ‘హీరో,’ కృష్ణవంశీ – శ్రీకాంత్ ల కలయికలో వచ్చిన ‘మహాత్మా,’ రవితేజ ‘నిప్పు’ సినిమాలలో నటించింది. తెలుగులో అంతంత మాత్రపు అవకాశాలే వచ్చినప్పటికీ, మలయాళంలో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎప్పటిలాగానే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భావనకు శుక్రవారం అర్ధరాత్రి మాత్రం చేదు అనుభవంగా మిగిలిపోయింది.

ADVERTISEMENT

షూటింగ్ అనంతరం తన కారులో కొచ్చి నుండి త్రిశూర్ వెళ్తున్న భావనను టెంపో ట్రావెలర్ లో కొందరు దుండగులు వెంబడించి, నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోకి వచ్చిన తర్వాత టెంపో ట్రావెలర్ బండితో భావన ప్రయాణిస్తున్న కారును గుద్దించారు. ఆ తర్వాత కారులో ఉన్న మార్టిన్ అనే డ్రైవర్ ను పక్కకు నెట్టేసి, కారులో భావనను ఎక్కించుకుని దాదాపుగా ఒక గంటన్నర్ర సమయం పాటు రోడ్లపై తిరుగుతూ లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా సమాచారం.

ఈ క్రమంలో భావనకు సంబంధించిన పలు ఫోటోలను, వీడియోలను తమ కెమెరాలలో బంధించిన సదరు దుండగులు పలరివత్తోం జంక్షన్ వద్ద కారును ఆపేసి పరారయ్యారు. దీంతో తనే కారును డ్రైవ్ చేసుకుంటూ దగ్గరలోనే ఉన్న సినిమా నిర్మాత ఇంటికి చేరుకుంది భావన. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందివ్వగా, ఎలా జరిగిందనే విషయాన్ని డ్రైవర్ అయిన మార్టిన్ వద్ద నుండి సమాచారం సేకరించారు. అయితే ఈ కుట్ర అంతా దాదాపుగా రెండు నెలల క్రితం ప్లాన్ చేసిందిగా పోలీసులు తేల్చారు.

గతంలో భావన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సునీల్ కుమార్ చేసిన కుట్ర అని, సునీల్ వ్యవహార తీరు నచ్చక చాలాసార్లు మందలించి, చివరికి డ్రైవర్ గా భావన తొలగించిందని, గతంలో సునీల్ పైన పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేసారు. అయితే పరారీలో ఉన్న సునీల్ కుమార్ గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక టాప్ హీరోయిన్ గా ఉన్న భావనపై ఈ స్థాయి ఘటన చోటుచేసుకోవడం మలయాళ ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపింది. భావన ఫోటోలు సేకరించిన సదరు దుండగులు ఏ విధమైన ఫోటోలను తీసారు? ఎలాంటి వీడియోలను చిత్రీకరించారు? అనేది కేసులో కీలకంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories