హాయిగా నవ్వగల రాజకీయ నాయకులు ఎందరు?

నేటి రాజకీయ నాయకులలో హాయిగా నవ్వగలవారు ఎందరు? కనీసం మనసారా చిర్నవ్వు నవ్వగలవారు ఎందరున్నారు? అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు.

అధికార పార్టీ నేతలకు ఓ రకమైన టెన్షన్లు.. ప్రతిపక్ష నాయకులకు మరో రకం టెన్షన్లు. కనుక దాదాపు అందరూ ఎప్పుడూ గంభీరంగానే కనిపిస్తుంటారు.

ADVERTISEMENT

కానీ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఎప్పుడూ సరదాగా జోకులు వేస్తూ హాయిగా నవ్వుతూనే ఉంటారు. అలాగని ఆయనకు ఎటువంటి టెన్షన్లు లేవని కాదు.

ఏడాదిన్నర క్రితం జిహెచ్‌ఎంసి సిబ్బంది ఆయన కాలేజీ భవనాలు కూల్చేయబోయారు. మరోపక్క కాలేజీలు, వాటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు, కేసులు సాగుతూనే ఉంటాయి. సుచిత్రా క్రాస్ రోడ్స్ వద్ద భూవివాదంలో వెళ్ళి కలబడ్డారు. ఆయనపై భూకబ్జాల ఆరోపణలు, కేసులు ఉండనే ఉన్నాయి. ఇవి కాక బీఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు.

ఇన్ని పనులు, ఇన్ని ఒత్తిళ్ళ మద్య కూడా మల్లారెడ్డి హాయిగా నవ్వుతూనే ఉంటారు. సరదాగానే ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఆయన 50వ పెళ్ళి రోజు సందర్భంగా శనివారం మల్లారెడ్డి కాలేజీలో జరిగిన వేడుకలో అయన ఉత్సాహంగా వేదికపై అందరితో కలిసి డాన్స్ చేయడమే.

దాదాపు ఆయన వయసే ఉన్న కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతుంటే, 70 ఏళ్ళ వయసులో మల్లారెడ్డి సినిమా పాటలకి ముందుగా రిహార్సల్స్ చేసి, డాన్స్ ప్రాక్టీస్ చేసి కళాకారులతో కలిసి వేదికపై హుషారుగా డాన్స్ చేశారు.

ఇంకా విశేషమేమిటంటే విజయ్‌ దేవరకొండ-రష్మికల సూపర్ హిట్ సినిమా ‘గీతా గోవిందం’లోని ‘తెల్లాతెల్లవారే వెలుగులా…’ పాటకి భార్య చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు.

అసలు ఈ వయసులో ఇన్ని బాధ్యతలు, సమస్యలు, ఒత్తిళ్ళు భరించడమే చాలా కష్టం. కానీ మల్లారెడ్డి వాటన్నిటినీ భరిస్తూనే జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆయన సంతోషంగా ఉండటమే కాదు… చుట్టూ ఉన్నవారిలో కూడా ఆ సంతోషం వ్యాపింపజేస్తుండటం మరీ గొప్ప విషయం. ఈ మాట నొక్కి చెప్పాల్సివస్తోందంటే, జగన్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ వంటివారు ఎల్లప్పుడూ అసూయా ద్వేషాలతో రగిలిపోతూ, వాటిని చుట్టూ ఉన్నవారికి కూడా వ్యాపింపజేసి సమాజంలో అవాంచనీయ వాతావరణం సృష్టిస్తుంటారు కనుక. వారు ఎల్లప్పుడూ లోలోన అశాంతితో రగిలిపోతూ ఒంటరితనం అనుభవిస్తుంటారు కనుక!

కానీ మల్లారెడ్డి మాత్రం బ్రతికినంత కాలం సంతోషంగా జీవించాలి. తన చుట్టూ ఉన్నవాళ్ళని కూడా సంతోష పెడుతుంటారు. అలాగని ఆయనేమీ సకలగుణాభిరాముడు కారు. అయినా సంతోషంగానే జీవిస్తున్నారు. ఎలా?

ADVERTISEMENT
Latest Stories