కేసీఆర్ ఎన్నాళ్ళు సజీవంగా ఉంచుతారో..!

mallu-bhatti-vikramarka-comments-on-warangal-municipal-pollsకాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు హ్యాండ్ ఇచ్చి తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించింది. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ కు తెలంగాణా ప్రజలు మొండి చెయ్యి చూపించిన విషయం అందరికి తెలిసినదే. రాష్రం ఏర్పడిన తరువాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా నమోదు చేసుకోలేకపోయింది.

గ్రేటర్ ఎన్నికల షాక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకుని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు టి-కాంగ్రెస్ నేతలు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరాజయాలకు ‘పుల్ స్టాప్’ పెడతాం అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. త్వరలో వరంగల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో విజయం తమదేనని టి-కాంగ్రెస్ నేతలు నమ్మకంగా చెపుతున్నారు. విజయం అనే పదానికి అర్ధమే మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ కి ఈ నమ్మకం ఏంటో అని తెలంగాణ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఆశ్చర్యం కలుగుతోందని సోషల్ మీడియా వేదికగా చలోక్తులు పడుతున్నాయి.

ADVERTISEMENT

వరంగల్ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిoదనే వారి మాటలు తిప్పి కొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ విజయాలను మొదలుపెడతాం అంటున్నారు భట్టి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశలను కేసీఆర్ సర్కార్ ఎన్నాళ్ళు సజీవంగా ఉంచుతుందో చూడాలి మరి!

ADVERTISEMENT
Latest Stories