తనతో ఓ రాత్రి గడిపితే 20 లక్షలు ఇస్తానన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కు బాలీవుడ్ నటి సోఫియా హయత్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. జీవితంలో మరోసారి అటువంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయకుండా మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లై ఇచ్చింది. @abhisheksinghbisht8 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఓ పోస్టు చేస్తూ తనతో ఓ రాత్రి గడిపితే 20 లక్షలు ఇస్తానని సోఫియా హయత్‌కు ఆఫర్ ఇచ్చాడు.
ఈ పోస్టుపై సోఫియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ… “20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు… నువ్వు ఆఫర్ చేసిన సొమ్ముతో నీ తల్లిని కొనగలవేమో. ఒకసారి మీ అమ్మను అడుగు” అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లై ఇచ్చింది. అంతేకాదు.. అతడి మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. సోఫియా సమాధానంతో అతడికి సరైన గుణపాఠం నేర్పారంటూ ఫాలోయర్స్ ప్రశంసిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



