MSG క్రెడిట్: మెగాస్టార్ దా? అనీల్ దా? పండగదా?

mana-shankara-vara-prasad-garu-collections-success-credit-goes-to

మన శంకర్ వరప్రసాద్ గారు పండగ విన్నర్ అందులో డిబేట్ లేదు, ఎప్పుడయితే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫాంటసీ హారర్ మూవీ అని డప్పులు కొట్టిన ప్రభాస్ సినిమా రాజా సాబ్ మొదటి షోకే చేతులెత్తేసిందో అప్పుడే పండగ విన్నర్ ఖరారు అయిపోయింది.

అయితే MSG క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వేయచ్చు?

ADVERTISEMENT

బాక్స్ ఆఫీస్ ని పరిగెత్తించిన మెగాస్టార్ అకౌంట్‌లోనా?

మెగాస్టార్ తో జతకట్టి, అనీల్-వెంకటేష్ కాంబినేషన్ (F2, F3, SV) పవర్ యాడ్ చేసిన వెంకటేష్ అకౌంట్‌లోనా?

పోయిన సంవత్సరం పండక్కి ఇలాంటి హిట్టే వెంకటేష్ తో కొట్టిన అనీల్ రావిపూడి అకౌంట్‌లోనా?

ఇవన్నీ కాదని అసలు మాట సంక్రాంతి “పండగ” అకౌంట్‌లోనా?

అంటే ఇవేమీ కాదనే చెప్పచ్చు.

మెగాస్టారే కారణం అనుకుంటే, ప్రస్తుతం పాన్ ఇండియా లోనే అంత కంటే పెద్ద హీరో అని అఫీషియల్ గా వేసుకున్న ప్రభాస్ మూవీ మొదటి షోకే చతికిల పడ్డం ఇప్పుడే చూశాం. చిరుది దీని ముందు మూవీ భోళా శంకర్ కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

వెంకటేష్ అకౌంట్‌లో వేయడానికి ఆయన రోల్ కూడా అంతలా పేలీ సినిమాకి హైలైట్ అయ్యిందీ లేదు.

ఇక మిగిలింది డైరెక్టర్ ఫాక్టర్, సంక్రాంతి పండగ ఫాక్టర్.

ఫ్రాంక్‌గా చెప్పాలంటే సింహ భాగం దర్శకుడి అనీల్ రావిపూడి ఖాతాలోకే వెళ్తుంది, అలా అని ఇదంతా సినిమాలో గట్టి కంటెంట్ మూలంగా అనడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా అనీల్ రావిపూడి ఫ్యామిలీస్ పుల్ ఫాక్టర్ + మెగా పుల్ + పండగ = ఈ రిజల్ట్ అనడం కరెక్టేమో.

ADVERTISEMENT
Latest Stories