పంచ్ పైన పంచ్ లతో ‘విఐపి’ వర్సెస్ ‘కామన్ మాన్’

Manchu-Lakshmi-Vs-Common Manహైదరాబాద్ లో ఓ గంటన్నర్ర సేపు ట్రాఫిక్ లో తను చవిచూసిన ఇబ్బంది గురించి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఈ ట్రాఫిక్ లో రాజకీయ నేతలు ప్రయాణించాలి, అప్పుడు వారి అనుభూతులు ఎలా ఉంటాయో… అంటూ మంచు లక్ష్మి చేసిన ట్వీట్ కు ఓ మహిళా నెటిజన్… “మేము తిరుమల దర్శనం కోసం లైన్ లో నిల్చున్నపుడు, మీరు విఇపి దర్శనం ద్వారా వెళ్ళేటపుడు మా ఆలోచనలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయని” అదిరిపోయే పంచ్ వేసింది.

ఈ ట్వీట్ కాస్త ట్విట్టర్ లో హైలైట్ కావడంతో సదరు నెటిజన్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. దీంతో మరొకసారి మంచు లక్ష్మి వివరణ ఇస్తూ రిప్లై ఇచ్చింది. “మీరు కూడా విఇపి అవ్వొచ్చు, డబ్బులు చెల్లించండి, కానీ సామాన్య ప్రజలు తిరిగే రోడ్లు అందరికి సంబంధించినవి, ఎదుటి వక్తిపై మాట విసరడం చాలా తేలిక, మంచిగా ఉండండి” అంటూ చేసిన ట్వీట్ కు మళ్ళీ అదిరిపోయే పంచ్ రావడంతో, ఆ పంచ్ లకు తోడు మంచు లక్ష్మిపై పంచ్ లు మీద పంచ్ లతో నెటిజన్లు మూకుమ్మడి పంచ్ లు వేస్తున్నారు.

ADVERTISEMENT

“నిజమా..! నేను కూడా విఇపి అవ్వొచ్చా? అయితే విఇపి అయ్యి, కామన్ మాన్ ను క్యూలో ఆపేద్దాం, విఇపిగా ఉంటూ అంతా విహరించడం తేలిక… బలంగా ఉండండి..!” అంటూ అదే నెటిజన్ మళ్ళీ లక్ష్మికి పంచ్ విసరగా, మరికొందరైతే, ‘కామన్ మాన్ గా ఉండి చిరాకు వచ్చేసింది, విఇపిగా ఉండాలంటే ఎంత చెల్లించాలి, ఎక్కడ కట్టాలి, మేం రెడీగా ఉన్నాం…’ అంటూ ఈ మంచు వారమ్మాయిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ‘సామాన్యుల’ విసురుతున్న పంచ్ లకు ‘విఇపి’ విలవిలలాడుతుండడం ప్రస్తుతం ట్విట్టర్ లో జరుగుతోన్న హాట్ టాపిక్.

ADVERTISEMENT
Latest Stories