ఈ ఫోటోలో దర్శనమిస్తున్న మంచు మనోజ్ బొమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయ్యప్పస్వామి మాలతో కనపడుతున్న మంచు మనోజ్ నిజంగా ఈ మాల ధరించారా? లేక సినిమాలో సన్నివేశంలో భాగంగా ఈ వస్త్రధారణ చేసుకున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా అయ్యప్ప మాల కార్తీక మాసం ముందు నుండి మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. మరి ప్రస్తుత సమయం దానిని మించిపోయింది. దీంతో మనోజ్ గెటప్ సినిమాలో సన్నివేశంలో భాగమేనని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ మాలధారణలో ఉన్నా, షేవింగ్ చేయకూడదు గనుక గుబురు గడ్డం దర్శనమివ్వాలి, అది కూడా లేకపోవడంతో, తన తాజా చిత్రం “శౌర్య”లో భాగంగా ఈ వస్త్రధారణలో కనపడి ఉంటారని అంచనా.
సినీ హీరోలు సాధారణంగా అయ్యప్ప మాలను ధరించరు. పరమ నియమ నిష్ఠలతో కూడిన అయ్యప్పమాల కావడంతో, కొన్ని దశాబ్దాలుగా తెలుగు హీరోలను పరిశీలిస్తే, అతి కొద్ది మంది మాత్రమే అయ్యప్పమాలతో సన్నివేశాలలో పాల్గొన్నారు.





