సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా, ప్రిన్స్ మహేష్ బాబుకు సోదరిమనిగా మంజుల తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘షో’ సినిమా ద్వారా జాతీయ అవార్డు అందుకున్న మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన “మనసుకు నచ్చింది” ప్రమోషన్ కార్యక్రమంలో మంజుల కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన దగ్గర ఓ కధ ఉందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తన తండ్రి కృష్ణ మరియు సోదరుడు మహేష్ బాబుల తర్వాత తనకు బాగా ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ అని, తను ఎప్పుడూ తన హార్ట్ ను మాత్రమే ఫాలో అవుతూ ముందుకు వెళ్తారని అన్న మంజుల, ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యానని, ‘పవన్ కళ్యాణ్’ అన్న పేరునే టైటిల్ గా అనుకున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలు చేసే ఉద్దేశంలో లేనట్లుగా కనపడుతున్నారని అన్న మంజుల, ఈ కధను వినమని పవన్ కు చెప్పాల్సిందిగా మీడియా వర్గాలను కోరారు.
నిజానికి ఈ కధ ఒక్కసారి వింటే, ఖచ్చితంగా చేయకుండా పవన్ కళ్యాణ్ ఉండలేరని,ఈ కధలో అంత డెప్త్ ఉందని, ఈ ఒక్క సినిమా చేసి రాజకీయాల్లోకి విజయవంతంగా వెళ్లిపోవచ్చని, కాస్త వినమని చెప్పాలంటూ మీడియా వర్గాలను కూడా చమత్కరించారు. మహేష్ సోదరిమనిగా పవన్ కళ్యాణ్ పై మంజుల చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ – మహేష్ అభిమానులు చర్చించుకునేలా చేసింది.



