టీజర్ టాక్ – కొత్తగా ఏముంది చెప్పడానికి..!

meeku meere maaku meme teaser talk routine storyసంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టిన “మీకు మీరే మాకు మేమే” సినిమా తొలి టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా తరుణ్ శెట్టి, అవంతిక వెండితెరకు పరిచయమవనున్నారు.

ప్రేమ – ప్రేమ తర్వాత జరిగే కధగా ఈ టీజర్ లో సినిమా కధ గురించి చెప్పేసారు. రొటీన్ ప్రేమ సన్నివేశాలు, అలాగే ప్రేమపై వేసే సైటైరికల్ డైలాగ్స్ మామూలుగానే ఉన్నాయి. ఇటీవల వస్తున్న చిన్న సినిమాల మాదిరి కూడా ఈ టీజర్ కనపడకపోవడం విశేషం.

ADVERTISEMENT

గీతా ఆర్ట్స్ అంటే ప్రేక్షకులు కొంత క్వాలిటీని ఆశిస్తారు. మరి ఈ టీజర్ లో అయితే దానికి ఆస్కారం లేదు. బహుశా ధియేటిరికల్ ట్రైలర్ ఏమైనా స్పష్టత ఇస్తుందేమో చూడాలి. హుస్సేన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories