కోట్ల కార్లు పెట్టుకుని సాధారణ ఆటో ఎక్కిన చిరంజీవి!

Meelo Aravru Koteswarudu Chiranjeevi Boards Autoమెగాస్టార్ చిరంజీవి ఆర్ధికంగా ఉన్న స్టేటస్ కు సొంత చార్టెడ్ ఫ్లైట్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అలాంటి చిరు కాలు బయటపెడితే, మరో కాలు కారులో పెట్టడానికి ఎలాగూ కోట్ల రూపాయల విలువైన కార్లు వరుసగా బారులు తీరి ఉంటాయన్న సంగతి తెలిసిందే. మరి ఆ స్థాయి గల చిరు ఓ సాధారణ ఆటో ఎక్కడమేంటి? అనుకుంటున్నారా? దాని వెనుకే ఉంది అసలు మతలబు. ఎప్పుడో సినిమా షూటింగ్ లలో భాగంగా ఆటో ఎక్కిన మెగాస్టార్, చాలా కాలం తర్వాత ఓ సాధారణ వ్యక్తి ఆటో ఎక్కారు.

ఇదంతా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేసిన మహిమేనని చెప్పాలి. సామాన్యులను దగ్గర చేసే విధంగా ఉండే ఈ కార్యక్రమంలో ఇప్పటికే నాగార్జున ఎంతో మంది మనసు దోచుకున్నాడు. తాజాగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేస్తున్న నేపధ్యంలో… మెదక్ జిల్లా నుండి వచ్చిన 25 ఏళ్ళ ఓ కుర్రాడు ఆటోలో ఎక్కి పయనించారు మెగాస్టార్. ఓ సాధారణ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న సదరు కుర్రాడు అభిలాష మేరకు తన ఆటోలో కలిసి ప్రయాణిస్తానని చెప్పడంతో, కార్యక్రమం తర్వాత ఆటోలో ప్రయాణించారు.

ADVERTISEMENT

దీంతో సదరు కుర్రాడు ఆనందం ఆకాశాన్ని తాకింది. చిన్నతనం నుండి కష్టపడుతూ సోదరి వివాహం చేసిన సదరు కుర్రాడు, కేవలం ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. తను గెలుచుకున్న మొత్తంతో తొలుత అప్పులను తీర్చి, తర్వాత నివాసం కొరకు ఓ గృహాన్ని ఏర్పాటు చేసుకుంటానని కార్యక్రమం ముందు చిరంజీవికి చెప్పారు. ఈ సందర్భంలోనే ఓ అభిమానిగా మిమ్మల్ని ఓ కోరిక కోరుతున్నానని… మీరు నా ఆటోలో ఎక్కాలని చిరుతో చెప్పగా, నేను ఆటో ఎక్కి చాలా కాలమైంది, ఖచ్చితంగా నీ ఆటో ఎక్కుతాను అని చిరునవ్వు చిందిస్తూ చెప్పారు మెగాస్టార్.

ADVERTISEMENT
Latest Stories