కమెడియన్ ప్రశ్న… ‘ఛీ పో సిగ్గన్న’ యాంకర్..!

Meenakshi from Swarnakamalam -Shooting Sreemukhiబుల్లితెర ప్రేమికులకు యాంకర్ శ్రీముఖి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేనంతగా ప్రేక్షకుల్లోకి దూసుకుపోయింది. ముఖ్యంగా యువ హృదయాలను కొల్లగొట్టడంలో సక్సెస్ సాధించిన ఈ ముద్దుగుమ్మ, తన తాజా గెటప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘స్వర్ణకమలం’ సినిమాలో మీనాక్షి పాత్రను పోషించిన భానుప్రియ ఫోటోను, ప్రస్తుతం తన ఫోటోను పక్కనపెట్టి, ఈ రోజు షూటింగ్ లో భాగంగా తన గెటప్ ఇదంటూ పోస్ట్ చేసింది.

దీనిని చూసిన టాలీవుడ్ టాప్ కమెడియన్ ‘వెన్నెల’ కిషోర్ కు ఓ సందేహం తలెత్తింది. ఇంతకీ… భానుప్రియ గారు కుడి చేతి వైపున ఉన్నారా? ఎడమ చేతి వైపున ఉన్నారా? అంటూ సందేహకరమైన ఎమోజీలను పోస్ట్ చేసారు. దీనికి స్పందించిన శ్రీముఖి ‘ఛీ పో నాకు సిగ్గు’ అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ ఇద్దరి సెలబ్రిటీల నడుమ ట్విట్టర్ వేదికగా సరదాగా సాగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories