సచిన్ బౌలింగ్ లోనే ఫస్ట్…!

Meet Mahendra Singh Dhoni 100 Stumping recordక్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఆదివారం నాడు సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ గా 100 స్టంపింగ్స్ చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అంతకుముందు సంగక్కర్ర 99 స్టంపింగ్స్ తో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘనతను పురస్కరించుకుని సోషల్ మీడియాలో ధోని అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే… ధోని మొట్టమొదటి స్టంపింగ్ ను ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ బౌలింగ్ లో చేయడం విశేషం.

ADVERTISEMENT

అలా సచిన్ బౌలింగ్ లో స్టంపింగ్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ధోని, తాజాగా శ్రీలంకలో చాహల్ బౌలింగ్ లో ధనంజయను వెనక్కి పంపడం ద్వారా 100ను ముగించాడు. బ్యాటింగ్ లో సచిన్ ఎన్ని రికార్డులు నెలకొల్పాడో, బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ ది ‘గోల్డెన్ ఆర్మ్’గా పేరొందిన విషయం తెలిసిందే. అలా బౌలింగ్ లోనే కాదు, ఏదైనా కొత్త క్రికెటర్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడంటే సచిన్ చేతుల మీదుగానే క్యాప్ ను అందించడం టీమిండియా ఆనవాయితీ. ధోని ఫస్ట్ స్టంపింగ్ ద్వారా మరో రికార్డులో కూడా సచిన్ ‘హస్తం’ ఉండడం విశేషం.

ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం… “లక్ష్మణ రేఖను దాటిన 100 మంది పురుషులను శిక్షించిన మొట్టమొదటి వ్యక్తి ధోని అని, ఈ అద్భుతం శ్రీలంకలోనే జరగడం మరింత విశేషమని” ట్వీట్ చేసింది. అలాగే ధోని ఒక ప్లేయర్, వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, ఫినిషర్, రికార్డ్ బ్రేకర్ అంటూ ప్రశంసలు కురిపించారు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇక, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించడంతో, సిరీస్ ను 5-0 తేడాతో అందుకుంది విరాట్ కోహ్లి సేన. ఈ మ్యాచ్ ద్వారా కెరీర్ లో కోహ్లి 30వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories