మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్‌పై ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. చిరంజీవికి కెరీర్ ఊపు మొదలైన తర్వాత అభిమానులు అందించిన అండ అంతా ఇంతా కాదు. వారి అండతోనే మెగాస్టార్ అంచెలంచెలుగా ఎదిగారు. చిరంజీవి సైతం ప్రతి విషయంలోనూ అభిమానులే తన బలమని చెతుంటారు. తాజాగా మెగా ఫ్యాన్స్ సైతం మెగాస్టార్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అందుకు కారణం.. ఇతర హీరోలైతే కాదు.. చిరంజీవి అండ్ టీమ్ అని సమాచారం. అసలేం జరిగింది. ఎందుకు అభిమానులు చిరంజీవి అసహనంగా ఉన్నారనే వివరాల్లోకి వెళితే..
చిరంజీవి ముందుగా నాగబాబు సపోర్ట్‌తో అంజనా ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. అయితే ఆ బ్యానర్‌పై చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలను దక్కించుకోలేదు. దాదాపు అంజనా ప్రొడక్షన్స్ సంస్థ సినీ నిర్మాణాలకు దూరంగానే ఉంటూ వస్తోంది. అయితే రామ్ చరణ్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుంచి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే మరో నిర్మాణ సంస్థ ఏర్పడింది. చిరు ఈ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యానర్‌ను ఇతర సంస్థలతో కలిసి సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఆనంద పడ్డారు. తమ అభిమాన హీరోకంటూ ఓ బ్యానర్ ఉందని, ఆ బ్యానర్‌లో సినిమాలు చేస్తే కావాల్సినంతగా సినిమాలను ప్రమోట్ చేస్తారని, మరో నిర్మాత అయితే పట్టించుకోరేమో కానీ.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఆధ్వర్యంలో నడిచే ఈ నిర్మాణ సంస్థ ప్రమోషన్స్ నుంచి ప్రతి విషయంపై ఎంతో కేర్ తీసుకుంటుందని భావించారు.
Also Read – సెప్టెంబర్-14 వీరిద్దరికి సమ్ థింగ్ స్పెషల్..!
కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించటం లేదు. చిరంజీవి చేస్తోన్న సినిమాల విషయంలో అలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సినిమా సబ్జెక్ట్స్‌ను సరిగ్గా ఎంచుకోకపోవటమే కాదు.. వాటి ప్రమోషన్స్ విషయంలోనూ అభిమానులకు నిరాశనే మిగులుస్తున్నారు. ఉదాహరణకు తాజాగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి వస్తోన్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా.. గురువారం ఈ మూవీ నుంచి ‘తార్ మార్ థకర్ మార్’ అనే మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ నుంచి క్రియేట్ అయిన గజి బిజీ మెగాభిమానులకు తెలియని చికాకుని కలిగిస్తుంది.
ఎందుకంటే ‘తార్ మార్ థకర్ మార్’ సాంగ్ ప్రోమోను మేకర్స్ అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. అప్పుడే మెగాభిమానులు కౌంటర్స్ రూపంలో తన కోపాన్ని తెలియజేశారు. చాలా ఆలస్యంగా ప్రోమోను రిలీజ్ చేశారు. తర్వాత ఈరోజు అంటే గురువారం సాయంత్రం 7 గంటలకు పూర్తి సాంగ్ రిలీజ్ అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రోమో విషయంలో జరిగిన ఆలస్యం అనే తప్పును రిపీట్ చేయకుండా సరైన సమయానికి సాంగ్‌ను రిలీజ్ చేస్తారేమోనని అందరూ భావించారు. అయితే కొణిదెల వారు వారి తీరుని మార్చుకోలేదు. థార్ మార్ థకర్ మార్ సాంగ్‌ను ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇలా అనుకున్న సమయానికి కంటెంట్‌ను ప్రొవైడ్ చేయటంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఈ సినిమాను ఏడాది నుంచే షూట్ చేస్తున్నారు. పాట చిత్రీకరణ కూడా ఎప్పుడో పూర్తయ్యింది. అలాంటి పాటను ముందుగానే ప్లాన్ చేసిన సమయానికి రిలీజ్ చేయటానికి మేకర్స్‌ను ఏమయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే మరో నిర్మాత అయితే మెగా ఫ్యాన్స్ మరో రేంజ్‌లో ఆడేసుకునేవారు. కానీ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఉండి కూడా ఈ అలసత్వం ఏంటనేది మెగాభిమానులు కొండంత బాధను కలిగిస్తుంది. వారు కోపాన్ని కూడా ప్రదర్శించలేని పరిస్థితి. దీంతో మింగలేక కక్కలేక వారు ఇబ్బంది పడుతున్నారు.
Also Read – అతితెలివి ప్రదర్శించినా జగన్ దొరికిపోయారుగా!
మరి మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఇకనైన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకుంటారేమో చూడాలి.