‘మహానుభావుడు’ హీరోయిన్ ‘వీర పెయిన్ గాధ’

mahanubhavudu Audio Vs SPyder Jai Lava Kusa‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరోయిన్ మెహ్రీన్, ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది. ముందుగా ‘మహానుభావుడు’ సినిమా ద్వారా ఈ వారమే ప్రత్యక్షం కానుండగా, తర్వాత రవితేజ “రాజా ది గ్రేట్” మరియు సందీప్ కిషన్ “కేరాఫ్ సూర్య” సినిమాల ద్వారా హంగామా చేయనుంది. కధానాయికగా ఈ ముద్దుగుమ్మ డెడికేషన్ ఏ పాటిదో ‘మహానుభావుడు’ చిత్ర యూనిట్ తాజాగా ఇచ్చిన ఓ ప్రొమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ‘కిస్ మీ బేబీ’ అంటూ సాగే పాటను ‘క్రియేషియా’లో చిత్రీకరించగా, ఈ పాటలో డాన్స్ చేస్తున్న మెహ్రీన్ ప్రమాదవశాత్తు పడిపోయిందట. దాంతో ఆమె వీపుకు బలమైన గాయం కాగా, ఆ పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్స్ కూడా ఏమీ లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. తన గురించి షూటింగ్ ఆపవద్దని చెప్పిన మెహ్రీన్, పెయిన్ కిల్లర్స్ వేసుకుని సాంగ్ చిత్రీకరణలో పాల్గొందట. బాధను భరిస్తూ ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ఆమెను యూనిట్ సభ్యులు ఎంతగానో అభినందిస్తూ… అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories