“పెళ్లిచూపులు” సినిమాతో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి నిర్మించిన తాజా చిత్రం “మెంటల్ మదిలో” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే మీడియా మిత్రులకు వేసిన షోల ద్వారా ఫుల్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు, సినీ విమర్శకులు కూడా బ్రహ్మరధం పట్టడం విశేషం.
కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో “పెళ్లిచూపులు” మాదిరే మంచి కమర్షియల్ హిట్ గా కూడా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. హీరో శ్రీవిష్ణుతో పాటు హీరోయిన్లు నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ లు మంచి స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం, సందర్భోచితమైన హాస్యం సినిమాలో ప్లస్ పాయింట్స్ గా మారాయి.
క్లైమాక్స్ లో హీరో నారా రోహిత్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరచగా, చిత్ర సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ఈ సినిమా రియల్ బ్రేక్ ఇస్తుందని సినీ విశ్లేషకులు కితాబిస్తున్నారు. ఆహ్లాదకరంగా, మంచి ఫీల్ ఉన్న సినిమాగా వెలువడిన “ఫస్ట్ టాక్”తో చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరో “పెళ్లిచూపులు” లాంటి హిట్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ఖాతాలో పడ్డట్లే!





